Three Police Stations : కమిషనరేట్ కు మూడు పోలీస్ జాగిలాలు నేరాల నియంత్రణలో పాత్ర కీలకం

TRINETHRAM NEWS

పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నేరాల నియంత్రణలో, నార్కోటిక్, ఎక్సప్లోసివ్ గుర్తింపు లో పోలీస్ జాగీలాల పాత్ర చాలా కీలకమని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్, ఐపిఎస్., ఐజీ అన్నారు
ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో ఏడాది పాటు శిక్షణ పొందిన 24వ బ్యాచ్‌కి చెందిన జాగిలాలు శుక్రవారం పాసింగ్ అవుట్ పస్సింగ్ అవుట్ పరదేశి పూర్తి చేసుకొని మూడు జాగిలాలు అందులో మూడు డాగ్స్ నార్కౌటిక్ డాగ్ (జెస్సి) గంజాయి, మత్తు పదార్థాల గుర్తింపు లో, స్నిపర్ డాగ్ (రైడర్) ఎక్స్ ప్లోజివ్ గుర్తింపు లో, ట్రాకర్ డాగ్ (టైసన్) వివిధ రకాల నేరాలకు పాల్పడిన నిందితులను గుర్తించడం లో సంవత్సరకాలం శిక్షణ పొంది కమిషనరేట్ కు రావడం జరిగింది. డాగ్స్ మరియు డాగ్స్ హాండ్లర్స్ ఈరోజు సీపీ మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో పోలీసులకు జాగిలాలు ఎంతో సహకరిస్తాయని అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరం జరిగిన చోట పరిసరాల్లో వాసన చూసి నిందితులు, అనుమానితులను, నేరస్తులను త్వరగా గుర్తించడానికి జాగిలాలను ఉపయోగించడం జరుగుతుందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి పట్టుకోవడంలో మరియు ఎక్స్ప్లోజివ్స్, బాంబ్స్ ను గుర్తించిన విధంగానే డ్రగ్స్, గంజాయిని ట్రేస్ చేసేందుకు ఈ నార్కోటిక్ స్నిఫర్ డాగ్స్ కీలక పాత్ర ఉంటుందని సీపీ తెలపడం జరిగింది
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ఏ ఆర్ ఏ సి పి ప్రతాప్, ఆర్ ఐ లు వామనమూర్తి, శ్రీనివాస్,మల్లేశం, సంపత్, సిసి హరిష్, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

three police stations

You cannot copy content of this page

Scroll to Top