Collector Koya Sri Harsha : ఎరువుల ఉత్పత్తికి సంపూర్ణ సహకారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TRINETHRAM NEWS

*రామగుండం లోని ఎరువుల కర్మాగారం, గోదావరిఖని జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి.. నిర్దేశిత లక్ష్యం మేరకు ఎరువుల ఉత్పత్తి చేసి రాష్ట్రానికి సరఫరా చేసేందుకు అవసరమైన సంపూర్ణ సాయ సహకారాలు జిల్లా యంత్రాంగం నుంచి ఆర్ ఎఫ్ సి ఎల్ కు అందిస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగుండం లోని ఎరువుల కర్మాగారం, గోదావరిఖని జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు.ఆర్ ఎఫ్ సి ఎల్ ప్లాంట్ లో జిల్లా కలెక్టర్ సెంట్రల్ కంట్రోల్ రూమ్ ప్రిల్లింగ్ టవర్,బ్యాగింగ్,లోడింగ్ & డిస్పాచ్ విభాగాలను పరిశీలించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ప్రస్తుత యాసంగి సీజన్‌లో తెలంగాణ రాష్ట్రానికి 2,14,223 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినందుకు ఆర్ఎఫ్సిఎల్ అధికారులను కలెక్టర్ అభినందించారు. రైతులకు వ్యవసాయ సీజన్‌లో సమయానుకూలంగా మరియు తగిన పరిమాణంలో యూరియా అందుబాటులో ఉంచినందుకు సంస్థ యాజమాన్యం మరియు సిబ్బంది చేసిన కృషిని ప్రశంసించారు.లోఉత్పత్తి, రవాణా పరిస్థితులను సమీక్షించిన అనంతరం, పీక్ డిమాండ్ సమయంలో తెలంగాణ రైతులకు యూరియా నిరంతర సరఫరా జరుగేలా ప్లాంట్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం పూర్తి సహకారం అందిస్తామని, స్థిరమైన ఉత్పత్తి మరియు సమయపాలిత ఎరువుల సరఫరా ద్వారా రైతు సమాజానికి మద్దతుగా పనిచేస్తామని పునరుద్ఘాటించింది అనంతరం గోదావరిఖని జనరల్ ఆసుపత్రి సందర్శించిన కలెక్టర్ గ్రౌండ్ ఫ్లోర్ జరుగుతున్న రిన్నోవేషన్ పనులను పరిశీలించారు.

ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులు నిలబడి వేచి చూసే అవసరం రాకుండా అదనపు కుర్చీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు ఆసుపత్రి ప్రాంగణంలో సిసి రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో ఎక్కడ దుమ్ము లేవకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. డ్రెస్ స్టోర్ నందు ఎక్కడ కూడా మందుల కొరత రాకుండా జాగ్రత్తలు వహించాలని, అవసరమైన రాక్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట వైద్యులు డా.రాజు, డా.అరుణ కృపా భాయ్, టిజి ఎంఐడిసి ఈఈ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Collector Koya Sri Harsha fully supports fertilizer production

You cannot copy content of this page

Scroll to Top