Congress : పేదల ప్రభుత్వమే కాంగ్రెస్

TRINETHRAM NEWS

తేదీ : 04/11/2025. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : (త్రినేత్రం న్యూస్); సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గం, లో ఉన్నటువంటి గ్రామపంచాయతీలు రేగళ్లపాడు, యాతాలకుంట గణేష్ పాడు, పెంట్లం ,ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , సున్నం. తిరుపతయ్య ,యం. కృష్ణయ్య, పోతు రెడ్డిపల్లి. రామారావు , లక్ష్మీనారాయణ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ , గత ప్రభుత్వం కంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు మరియు ప్రజలందరు కు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యేల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ వాళ్లు సంతోషాన్ని వ్యక్తపరిచారు.
ప్రజలకు ఏదైనా సమస్య వస్తే మేము చేసే పరిష్కారమైతే చేస్తున్నాము లేనియెడల ఆ సమస్యలకు పరిష్కారం ఎవరు చేస్తే అవుతుందో వాళ్లతో చేపిస్తున్నామని పేర్కొన్నారు. శాసనసభ్యులు నాయకులకు, కార్యకర్తలకు అధికారులకు కూడా అందుబాటులో ఉండి వాళ్ల సమస్యలకు పరిష్కార మార్గంగా మేమందరం పనిచేస్తున్నామని సూచించారు. నిరుపేదలకు కావలసిన సంక్షేమ పథకాలు
ఈ ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు. ఉచిత కరెంటు, నాణ్యమైన సన్నబియ్యము, రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, ఐదు వందల రూపాయలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కళ్యాణ లక్ష్మి , ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి కులం, మతం, పార్టీ, భాషా భేదం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని ధీమా వ్యక్తపరిచారు. ప్రతి గ్రామంలో కూడా వీధిలైట్లు, సిసి రోడ్లు, మంచినీరు సరఫరా కొరత లేదని అనడం జరిగింది. రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన అధిక మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందని, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని భావించారు. తమ సొంత డబ్బులు కూడా గ్రామ అభివృద్ధికి ఖర్చుపెట్టినట్లు చెప్పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress is the government of the poor

You cannot copy content of this page

Scroll to Top