దేవరకొండ ఏప్రిల్ 19 త్రినేత్రం న్యూస్. రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్ఏ నేనావత్ బాలు నాయక్. గుడ్ ఫ్రైడే , ఈస్టర్ పండుగలను పురస్కరించుకొని నేడు దేవరకొండ పట్టణంలో ని చర్చ్ కమాన్ వద్ద రన్ ఫర్ జీసస్ కార్య క్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంఎల్ఏ బాలు నాయక్ మాట్లాడుతూ ప్రపంచానికి ప్రేమ తత్వం బోధించిన దయామయుడు సిలువపై యేసుక్రీస్తు త్యాగం మహోన్నతమైన అన్నారు. కరుణామయుడి జీవితం మానవాళికి అందించిన సందేశం అని ప్రభువు యేసు త్యాగాన్ని స్మరిస్తూ క్రైస్తవ సోదరా సోదరీమణులకు ఆధ్యాత్మిక శాంతి చేకూరాలని ప్రార్థించారు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్, మాజీ జెడ్పిటిసి పారుపాకుల అరుణ సురేష్ గౌడ్, మాజీ ఎంపీపీలు ఏడుపుల గోవిందు యాదవ్, బిక్కు నాయక్, ఎంపీడీవో డానియల్, చైర్మన్ ఎస్.డి జాన్, పాస్టర్ కే వేణు, కోనేరు ప్రభు ప్రసాద్, ఎండి టైటస్, ఇసాక్, పురుషోత్తం, నిత్యానందం, వైయస్ కరుణాకర్, యేసు రత్నం, అభిషేకం, సాల్మన్ రాజ్, ప్రశాంత్ కుమార్, విక్రమ్, కౌన్సిలర్ ఇలియాస్, మిచెల్ ప్రసన్నకుమార్, యువజన నాయకులు బాబురావు నాయక్, యువజన కాంగ్రెస్ నాయకులు, క్రైస్తవ సోదర సోదరీమణులు, అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


