Harish Rao : సింగరేణి ‘మారుపేర్ల’ బాధితులకు కాంగ్రెస్ నమ్మకద్రోహం!

TRINETHRAM NEWS

సింగరేణి భవన్ సాక్షిగా కార్మికుల గొంతుకై గర్జించిన హరీష్ రావు

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి… ఎలక్షన్ సమయంలో భూపాలపల్లి సభ సాక్షిగా ఇచ్చిన మాట ఏమైంది రేవంత్ రెడ్డి.. అలియాస్ పేర్ల చిక్కులతో కార్మిక కుటుంబాల గోస మీకు వినిపించడం లేదా? హైదరాబాద్ సింగరేణి కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు నేడు సింగరేణి భవన్ వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా మారుపేర్ల (అలియాస్ నేమ్స్) బాధితుల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.

ప్రధాన డిమాండ్: మారుపేర్ల బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి!
మాట తప్పిన సీఎం: “కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులకు న్యాయం చేస్తాం” అని భూపాలపల్లి సభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ నేడు ఆ హామీని గాలికి వదిలేశారు.
పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం తండ్రులు కష్టపడి పనిచేశాక, వారి ఉద్యోగాలు వారసులకు అందకుండా అలియాస్ పేర్ల సాకుతో, పెండింగ్ కేసుల పేరుతో సంవత్సరాల తరబడి తిప్పుకోవడం ధర్మమేనా? ఎంపీలు, ఎమ్మెల్యేలకు కళ్లు లేవా?: ఉద్యోగాలు రాక, న్యాయం జరగక కార్మికుల పిల్లలు చేస్తున్న అలుపెరగని పోరాటాలు కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కనిపించడం లేదా?
మరొక మోసం – మెడికల్ బోర్డు అన్యాయం: అనారోగ్యంతో మెడికల్ బోర్డుకు వెళ్తే.. వారిని అన్‌ఫిట్ (అన్ఫిట్) చేసి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి, బలవంతంగా “ఫిట్ ఫర్ సేమ్ జాబ్” (ఫిట్ ఫర్ సమె జాబ్) అని ఇస్తూ కార్మికులను నరకయాతన పెడుతున్నారు. కార్మికులకు కన్నీరు మిగిలిస్తున్నారు.
హరీష్ రావు హెచ్చరిక తక్షణమే మారుపేర్ల సమస్యను పరిష్కరించి, బాధితులకు ఉద్యోగాలు కల్పించాలి. అలాగే సొంత ఇంటి కల, పెర్క్స్ పై ఇన్‌కమ్ టాక్స్ రద్దు, మెడికల్ బోర్డును పకడ్బందీగా నిర్వహించాలి. లేనిపక్షంలో సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనుల సాక్షిగా ఉద్యమం ఉధృతం చేస్తాం.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు: బీఆర్ఎస్ పార్టీ మరియు టీబీజీక్స్ ముఖ్య నాయకులు కొప్పుల ఈశ్వర్ మిర్యాల రాజిరెడ్డి ఇతర ముఖ్య నాయకులు మరియు అధిక సంఖ్యలో బాధితులు, కార్మికులు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress betrays Singareni 'nickname' victims

You cannot copy content of this page

Scroll to Top