
-తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చిరస్మరణీయం
-పార్టీ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి
-దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్
Deeksha Divas : దేవరకొండ డివిజన్ నవంబర్ 26, త్రినేత్రం న్యూస్. ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.గురువారం దేవరకొండ పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ……………..తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిన నవంబర్ 29వ తేదీని ప్రతి సంవత్సరం దీక్షా దివస్‌గా జరుపుకుంటున్నామని తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 29న దేవరకొండ పట్టణంలో దీక్షా దివస్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న అన్యాయాలు, వివక్ష, నీళ్లు, నిధులు, నియామకాలలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. ఈ ఉద్యమానికి బలమైన రాజకీయ దిశను చూపుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారని తెలిపారు.ఆనాడు కేసీఆర్ చేపట్టిన దీక్ష ఒక వ్యక్తి పోరాటం కాదని, అది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటమని అన్నారు.
తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఆయన చేసిన పోరాటం యావత్ దేశం దృష్టిని తెలంగాణ వైపు మళ్లించిందని పేర్కొన్నారు.కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం మహా ప్రజా ఉద్యమంగా మారిందని, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, కార్మికులు, మహిళలు, ప్రజాసంఘాలు ఏకమై ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించాయని తెలిపారు. తెలంగాణ సమాజం మొత్తం ఒకే గొంతుకగా మారి సాగించిన పోరాట ఫలితంగానే 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు.ఎన్నో అవమానాలు, అడ్డంకులు, కుట్రలు ఎదురైనా తెలంగాణ ప్రజల పోరాట పటిమ ముందు అవి నిలవలేకపోయాయని, తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ నాయకత్వం, ఉద్యమకారుల త్యాగాలు, ప్రజల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధనతోనే కేసీఆర్ బాధ్యత ముగియలేదని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని గుర్తుచేశారు.నవంబర్ 29న నిర్వహించే దీక్షా దివస్ సమావేశం ద్వారా తెలంగాణ ఉద్యమ చరిత్రను, కేసీఆర్ త్యాగాన్ని, పోరాట స్ఫూర్తిని మరోసారి ప్రజలకు గుర్తుచేస్తామని రవీంద్ర కుమార్ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామగ్రామాన ప్రజలను సమీకరించి దేవరకొండలో జరిగే దీక్షా దివస్ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe