Bandi Ramesh : టిపిసిసి ఉపాధ్యక్షులు బండి రమేష్ కి శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసిన కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య,కార్యవర్గ సభ్యులు.

అనంతరం కూకట్పల్లి ప్రెస్ క్లబ్ స్థలము,భవన నిర్మాణం కొరకు వినతి పత్రం అందజేత. కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 18 : టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ ని కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య, కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం కూకట్పల్లి ప్రెస్ క్లబ్ స్థలము భవన నిర్మాణం కొరకు కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి ఇంచార్జ్ బండి రమేష్ ని కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య,కార్యవర్గం కమిటీ సభ్యులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ స్థలము, భవనం లేక ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా విలేకరులు ప్రెస్ మీట్లు,యూనియన్ మీటింగులు,సమస్యల గురించి చర్చించుకుందామంటే సరైన షెల్టర్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు.ఇక్కడ విలేకరుల ఐక్యతా లోపమో మరి ఇంకేదైన కారణమో ఇప్పటి వరకు ఏ విలేకరి ప్రెస్ క్లబ్ కొరకు ఆలోచన చేయలేదు.అలాగే విలేకరులను సంఘటితం చేయలేక పోయారని ఆయన వివరించారు.

ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ ను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించుకుని,జర్నలిస్టులకు అందుబాటులోకి వెంటనే తీసుకువస్తానని,అలాగే జర్నలిస్టులందరికీ సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా చర్యలూ తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. కూకట్పల్లి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు (జివిఆర్), ఏఎంసీ చైర్మన్ పుష్ప రెడ్డి, పిడికిడి గోపాల చౌదరి,కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ కోశాధికారి పుట్టి నగేష్, జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు, సుజాత, సభ్యులు శైలజ, అనిల్ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congratulations to TPCC Vice

You cannot copy content of this page

Scroll to Top