జూన్ 26, 2026
TRINETHRAM NEWS

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

రహమత్ నగర్ మసీదులో ఇఫ్తార్ విందుకు హాజరు
Trinethram News : రాజమహేంద్రవరం : ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో స్థానిక రహమత్ నగర్ మసీదులో శుక్రవారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్చార్జి అత్తి సత్యనారాయణ, ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందును చేశారు.

అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రహమత్ నగర్లో త్వరలోనే షాదీఖానా నిర్మించుకోనున్నామని అందుకు కావలసిన చర్యలు త్వరలోనే చేపడతామన్నారు. 2014లో నగరంలోని మసీదులు అభివృద్ధి, షాదీఖానాల నిర్మాణాల కోసం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తో పలు జీవోలు తీసుకురావడం జరిగిందని, తదుపరి అధికారంలోకి వచ్చిన వైకాపా వాటిని నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇప్పుడు మళ్లీ మన ప్రభుత్వం వచ్చినందున నిలిచిపోయిన అభివృద్ధి పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు.

ఆ అల్లాహ్ ఆశీసులు అందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదన్నారు. ఇమామ్ లు, మోజాన్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని తమ కూటమి ప్రభుత్వం పెంచిందన్నారు. త్వరలోనే వక్ఫ్ బోర్డు కమిటీలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం మైనారిటీలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Adireddy Srinivas iftar

You cannot copy content of this page