MLA Adireddy : విజ్ఞానవంతుడు పేరాబత్తులకు పట్టం కడదాం

TRINETHRAM NEWS

విజ్ఞానవంతుడు పేరాబత్తులకు పట్టం కడదాం

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు

బార్ అసోసియేషన్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
Trinethram News : రాజమహేంద్రవరం : త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించి విజ్ఞాన వంతుడైన పేరాబత్తుల రాజశేఖరానికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లా కోర్టు ఆవరణలోని ది రాజమండ్రి బార్ అసోసియేషన్ హాల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూటమి అభ్యర్థిగా పోటీలో నిలిచిన పేరాబత్తుల రాజశేఖరం మంచి ఆలోచనపరులని, నిరుద్యోగుల సమస్యల పట్ల గళం వినిపిస్తారని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల విజయమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. పేరాబత్తుల రాజశేఖరానికి ఒక్క అవకాశం ఇస్తే పట్టభద్రుల ప్రయోజనాలను కాపాడుతారన్నారు. నిరుద్యోగుల సమస్యలనూ ప్రభుత్వం దృష్టికి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.

ఏడేళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లింపులు, వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. 2023లో టీడీపీ గెలిచిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఏ విధంగా అయితే కృషి చేశారో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రెట్టింపు స్థాయిలో కృషి చేసి రాజశేఖరానికి విజయం చేకూర్చాలని కోరారు.

అసెంబ్లీ ఎన్నికలకు, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుందని, ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్‌ పేపర్లో పార్టీ సింబల్‌ ఉండదని.. క్రమ సంఖ్యలో నెంబర్లు ఉండి పేర్లు మాత్రమే ఉంటాయని… కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖరం పేరు ఎదురుగా ఉన్న గడిలో 1వ నెంబర్‌ వేసి ఆయనకు అఖండ విజయం చేకూర్చాలని న్యాయవాదులను కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top