CMRF : సి .ఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 21 :నెల్లూరు జిల్లా :దగదర్తి మండలం.. దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్రనాయుడు అభ్యర్థన మేరకు గతంలో దగదర్తి మండలం నుండి ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు ప్రతిపాదనలు పంపగా ఈరోజు వారికి పార్లమెంట్ సభ్యులు , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి , చేతులమీదుగా సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు అందించడం జరిగింది.

ఈ సందర్భంగా వి.పి.ఆర్ దంపతులను దగదర్తి మండల టిడిపి యువ నాయకులు మాలేపాటి లోకేష్, సీనియర్ టిడిపి నాయకులు కంచర్ల సునీల్, దగదర్తి గ్రామ టిడిపి ఇన్చార్జ్ కంచర్ల కృష్ణ కలిసి ధన్యవాదాలు తెలిపారు.

చెక్కులను అందుకున్న ధర్మవరం గ్రామ వాస్తవ్యులు కొంచె వెంకట సుభాషిని, కొంచె చిన్న రమణారెడ్డి మరియు లింగాలపాడు గ్రామానికి చెందిన దేవిరెడ్డి వెంకటరమణ మాలేపాటి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CMRF Cheque Distribution

You cannot copy content of this page

Scroll to Top