CMRF : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం : పరిగి పట్టణంలోని ప్రజా భవన్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు సీఎంర్ఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. పరిగి శాసన సభ్యులు డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి , నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన మొత్తం 205 మంది లబ్ధిదారులకు, రూ.76,00,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంర్ఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అని,ప్రజలు ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ప్రభుత్వం ఎప్పుడూ వారి పక్కనే ఉంటుందని,అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్న పేదలు అప్పుల పాలు కాకూడదన్న ఉద్ధేశ్యంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు.చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే ,సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM Relief Fund

You cannot copy content of this page

Scroll to Top