ఎరవల్లి ముత్యం రావు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి
త్రినేత్రం న్యూస్ గోదావరిఖని ప్రతినిధి… ఈరోజు సీఐటీయూ బ్రాంచ్ రాష్ట్ర నాయకులు జీడీకే-2 ఇంక్లైన్ గని కార్మికుల మౌలిక సౌకర్యాల సాధన కోసం గేట్ మీటింగు ధర్నా నిర్వహించడం జరిగింది, ముఖ్య అతిథిగా: హాజరైన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎరవల్లి ముత్యం రావు, మెండె శ్రీనివాస్ మాట్లాడుతూ గని పై ఉన్న స్థానిక సమస్యలపై ఉద్యోగస్తులు అనేక విషయాలు సిఐటియు నాయకత్వానికి తెలియజేయడం జరిగిందిని, ఆ డిమాండ్లనే వినతి పత్రం తయారుచేసి ఉద్యోగస్తుల అందరితో మా నాయకత్వం సంతకాల సేకరణ చేయించడం జరిగిందన్నారు.
ఎక్కడ చూసినా చెత్త చెదారం, వానకు ఊరిసే రేకులు మరియు గదులు, వెల్తురు లేని దారులు, పాములు, కుక్కల, దోమల బెడద, సౌకర్యవంతంగా లేని నీటి పంపులు, కార్మికుల వస్తువులు భద్రపరచుకోవడానికి లాకర్లు లేక ఇబ్బంది పడడం, అలాగే యాక్టింగ్ ల సమస్య పని ఒత్తిడి తదితర కారణాలతో టెక్నీషియన్లు లేక ఇబ్బంది పడుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది యువ టెక్నీషియన్లను డిప్టేషన్ ల పేరుతో ఓసిపి 5 పంపిస్తూ గని లో పనిచే కార్మికులను ఇబ్బందులు పెడుతున్నారని తెలియజేశారు, వాషింగ్ పంపుల వద్ద పాకూరు పేరుకపోయి కాళ్లు చేతులు కట్టుకుందాం అంటే జారి పడే అవకాశాలు ఉన్నాయని గని పై చెత్తతో నిండి ఉందని ఎటు వెళ్ళాలన్నా క్రిమి కీటకాలు పాముల కుక్కలు కోతుల భయంతో ఇబ్బందులు పడుతున్నారని.
ఈ చెత్తాచెదారంలోనే భోజనాలు చేయవలసిన పరిస్థితిలు ఉన్నాయని తెలియజేశారు పై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన కనీస మౌలిక సమస్యలు సౌకర్యాలు సంక్షేమం కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని.. 15 రోజుల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోతే యజమాన్యం అధికారుల నిర్లక్ష్యాన్ని సిఐటియు సహించదని అవసరమైతే యూనియన్ల కతీతంగా ఉద్యోగస్తులందరినీ ఏకం చేసి గని పై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు.
ఉద్యోగస్తులతో సంతకాలు చేయించిన.. సమస్యల వినతి పత్రాన్ని గని మేనేజర్ అందించడం జరిగింది. అనంతరం సిఐటియు పోరాటాలకు ఆకర్షితులైన ఉద్యోగస్తులు ఎ కుమార్. జి బాబూరావు. ఎండి గౌసుద్దీన్. టి శ్రీనివాస్. యూనియన్ లో చేరడం జరిగింది వీరందరికీ కామ్రేడ్: ఎరవల్లి ముత్యం రావు, మెండె శ్రీనివాస్ గారు సిఐటియు కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎరవల్లి ముత్యం రావు, ఆర్జీవన్ బ్రాంచ్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్, పిట్ కార్యదర్శి అనబోయిన శంకర్, పుప్పాల శ్రీనివాసరావు, పెండ్యం సమ్మయ్య, మెదరీ కుమార్, గద్దె జనార్దన్ రెడ్డి, తాళ్ల శ్రీనివాస్, సిహెచ్ లక్ష్మణ్. కొమురయ్య. ఉరుసు సందీప్. భీమా నాయక్. రాకేష్. రామకృష్ణ, రాజయ్య, 50 మంది కార్యకర్తలు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


