CITU : లాభాలు చెప్పడానికి ఆలస్యం ఎందుకు?

TRINETHRAM NEWS

తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని ఓసిపి-5 కార్మికులను కలిసేందుకు వెళ్లిన సందర్భంగా తుమ్మల రాజా రెడ్డి మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరం గడిచి నాలుగు నెలలు గడిచిన ఇప్పటికి యాజమాన్యం సంస్థకు వచ్చిన లాభాలను చెప్పడానికి మీనమేషాలు లెక్కిస్తుండడంతో కార్మికులందరూ సంస్థ పట్ల గురువుగా ఉన్నారని, ఈరోజు ఐఎన్టీసీ నాయకత్వం లాభాలవాటపై నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తున్నారని, రేపు సిఐటియుగా అన్ని గనులు డిపార్ట్మెంట్లలో వినతి పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నామని, అన్ని కార్మిక సంఘాలు ఏదో ఒక రూపంలో నిరసనలు ఆందోళనలు చేస్తుంటే యాజమాన్యం మౌనంగా ఉండడం సరికాదన్నారు.

కార్మిక సంఘాలు చేసే ఆందోళనలు ధర్నాలు నిరసన వల్ల సంస్థలో పారిశ్రామిక సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఉన్నందున యాజమాన్యం వెంటనే సంస్థకు వచ్చిన లాభాలను తెలియజేసి 35% వాటాను ప్రభుత్వం చేత చెల్లించేలా ఒప్పించాలన్నారు యాజమాన్యం లాభాలు ప్రకటించిన తర్వాత ప్రభుత్వం వాటాను ప్రకటించడం అనవాయతిగా వస్తుందని గత రెండు నెలల క్రితమే సంస్థ చైర్మన్ 5000 కోట్ల పైచిలుకు లాభాలు వచ్చాయని చెప్పిన ఆడిట్ పూర్తయినా కూడా ఇప్పటికి లాభాలు ప్రకటించకపోవడం చూస్తుంటే సంస్థ ఆర్థిక పరిస్థితి పై కార్మికులకు అనుమానం వస్తుందని దీనితో ప్రభావం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై కూడా పడే అవకాశం ఉన్నందున కోల్ బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి పై ఒత్తిడి తెచ్చి వాటా చెల్లించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తోట నరహరి రావు, ఆర్జీవన్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, పిట్ సెక్రెటరీ ఈద వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు,

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Why the delay in announcing the profits?

You cannot copy content of this page

Scroll to Top