Circle Police meet with SP, DSP : ఎస్పీ, డీఎస్పీ తో సర్కిల్ పోలీసులు భేటీ

TRINETHRAM NEWS

ఈస్ట్ జోన్ పోలీస్ సబ్ డివిజన్ లోకి మండపేట

త్రినేత్రం న్యూస్, జనవరి 23, మండపేట నియోజకవర్గం డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుండి తూర్పు గోదావరి జిల్లా లో గత ఏడాది డిసెంబర్ 31 న విలీనం అయింది. ఈ నేపధ్యంలో పోలీస్ సబ్ డివిజన్ రామచంద్రాపురం లో కొనసాగింది. కాగా శుక్రవారం నుండి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ పోలీస్ సబ్ డివిజన్ లోకి మారింది.

ఈస్ట్ జోన్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు అనపర్తి నియోజక వర్గం లోని అనపర్తి, బిక్కవోలు, పెదపూడి పోలీస్ స్టేషన్ లు ఉన్నాయి. వీటి తో బాటు మండపేట టౌన్, రూరల్ సర్కిల్ లోని మండపేట టౌన్, మండపేట రూరల్, రాయవరం, అంగర పోలీస్ స్టేషన్ లు ఈస్ట్ జోన్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఉంటాయి.

ఈ నేపధ్యంలో తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ , ఈస్ట్ జోన్ డీఎస్పీ బి. విద్యా లను రూరల్ సీఐ పి. దొర రాజు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సర్కిల్ ఎస్‌ఐలు వి.కిషోర్, డి.సురేష్‌బాబు, హరీష్‌లతో కలిసి వెళ్ళారు.

సర్కిల్ పరిధి లో శాంతి భద్రతలు పరిపాలన కి సంబంధించిన వివిధ అంశాలను డీఎస్పీ బి విద్య తో చర్చించారు. బొమ్మూరు లోని ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న ఈస్ట్ జోన్ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో భేటీ అయ్యారు. మండపేట నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలో విలీనం కావడం తో ఇక పోలీస్ కార్యకలాపాలు తూర్పు గోదావరి జిల్లా పోలీస్ పరిధిలో ఉంటాయనీ రూరల్ సి ఐ దొర రాజు స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Circle Police meet with SP, DSP

You cannot copy content of this page

Scroll to Top