
CI Nagaraju Arrested : ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 23; జిల్లా కేంద్రమైన విజయవాడ పట్టణం, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గాదె సాయి కృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ మరణానికి కారణమైన కృష్ణలంక సీఐ నాగరాజును సీట్ అధికారులు అరెస్టు చేశారు.
గాదే సాయి కృష్ణ ను పోలీస్ స్టేషన్ లో అక్రమంగా బంధించి, కొట్టి చంపిన కేసు లో సిఐ ను అరెస్టు చేయడంతో పాటు, దళితు డైన పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మ హత్య విషయం మీద కూడా లోతైన విచారణ జరుగుతోంది. ఇవే కాకుండా సిఐ అక్రమాస్తుల మీద కూడా సిట్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.
ఎట్టకేలకు ఆయనను సంబంధిత అధికారులు అరెస్టు చేయడంతో ఆ లంక ప్రజలు కొంతవరకు ఊపిరి పీల్చు కన్నారు.మునుముందు ఏ పోలీసు అధికారి చట్టాన్ని దిక్కరించకుండా, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా,కఠినమైన శిక్ష పడాలని ప్రజలు కోరుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe