ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Rama Lakshmana

Rama Lakshmana : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 23 ; వైసీపీలో ఉన్నటువంటి కాపు నేతలు జగన్ కుంభ హస్తాలలో ఇరుక్కున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. చంద్రబాబు కాపులకు రిజర్వేషన్ ఇస్తే , జగన్ రద్దు చేశాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం రామలక్ష్మణుల కలిసే ఉంటారని పేర్కొన్నారు.

విడిపోవడం అనేది అసాధ్యం, కలిసే ఉంటారనేది నమ్మకం . వీళ్ళిద్దరూ కలిసి ఉన్నంతకాలం గొడ్డలి పార్టీ వైసీపీకి మనుగడ ఉండదని, విడదీస్తే ప్రయత్నాలు ఎన్ని చేసినా విడిపోవడం జరగదని స్పష్టం చేశారు. ఓపిక సహనం ఉన్నంతవరకు ఎవరైనా సహిస్తూ ఉంటారని, అవి మాత్రం తగ్గిపోతే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page