Child Protection : బాలల పరిరక్షణ మనందరి బాధ్యత

TRINETHRAM NEWS
Child protection is the responsibility

తీదేడు గ్రామంలో” మిషన్ వాత్సల్య పథకం “బాలల చట్టాలపై అవగాహన కార్యక్రమం… ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి

తీదేడు గ్రామ సర్పంచ్ (బాలల పరిరక్షణ కమిటీ ఛైర్మన్)

Child Protection : చింత పల్లి మార్చ్ 26, త్రినేత్రం న్యూస్. బాలల పరిరక్షణ మనందరి బాధ్యతని తీదేడు గ్రామ సర్పంచ్ గ్రామ బాలల పరిరక్షణ కమిటీ ఛైర్మన్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జిల్లా బాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…బాల బాలికలను అన్ని రంగాలలో ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరు సహాకరించాలని ఆమె అన్నారు.బాల్య వివాహాలు జరుగకుండా ప్రతి ఒక్కరు చూడాలని ఆమె అన్నారు.బాలలందరు బడికి వెళ్ళేలా,బాల కార్మికులు లేకుండా,బాలలపై ఎలాంటి వేధింపులు జరుగకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని తెలిపారు.బాలల సంక్షేమ కోసం ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్,మాజీ ఉప సర్పంచ్లు ధరణిపతి రమణారావు, ఉలుపాల శేఖర్ రెడ్డి,సోనగంటి గొవర్థనాచారి,వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి,మాదగోని కృష్ణ గౌడ్, గంటెల అలివేలు సోమయ్య, దాసరి కళమ్మ ముత్తయ్య, రెడ్డి పద్మ పరమేష్,సందె లక్ష్మయ్య,మర్ల యాదగిరి,ఐ‌.సి.పి.యస్ సభ్యులు రాము,అంగన్వాడి సూపర్వైజర్ ప్రసన్న లక్ష్మి,అంగన్వాడి టీచర్లు, ఆశావర్కర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top