
బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
Happy Sri Ramanavami : దేవరకొండ డివిజన్ మార్చ్ 25, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
నియోజకవర్గ ప్రజలంతా శ్రీరామ నవమిని భక్తి,శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.నవమి రోజున ప్రతి ఏటా వైభవోపేతంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటారని అన్నారు. లోక కళ్యాణం కోసం ఎన్నోత్యాగాలను కోర్చిన సీతారాముల పవిత్ర బంధంఅజరామరమైనదని,రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదని ఆయన తెలిపారు.
సీతారాముల ఆశీస్సులు ప్రజలకు ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని సీతారామచంద్రమూర్తులను ప్రార్ధించనున్నట్టు ఆయన తెలిపారు. నియోజకవర్గ ప్రజలంతాసుఖ,సంతోషాలతో శ్రీరామనవమి జరుపుకోవాలని కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

