జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 29 at 16.01.38

TRINETHRAM NEWS

చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 పై అవగాహన కల్గి ఉండాలి

జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు

పెద్దపల్లి, జనవరి -29: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 పై అవగాహన కల్గి ఉండాలని జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు తెలిపారు. బుధవారం జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు రేగడిమద్దికుంట లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు మాట్లాడుతూ, బాలల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. బాల్యవివాహాలు, బాల కార్మికులు, మైనర్లకు లైంగిక వేధింపులు, పిల్లలను ఇతర రకాల వేధింపులకు గురి చేస్తే 1098 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు.

మైనర్ ప్రేమ వివాహాలు, మొబైల్ వాడకం వల్ల పిల్లలకు జరుగుతున్న నష్టాలను వివరిస్తూ చిన్నతనం నుండి పుస్తక పఠనం వంటి మంచి అలవాట్లు అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page