భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
తిరుపతి : ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…
• సంస్కృతి, సంప్రదాయాలను నిలబెడుతూ.. దేశాభివృద్ధి కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కృషి చేస్తున్నారు.
• మన దేశం, భారతీయత గురించి చర్చించుకోవడానికి భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ మంచి వేదిక.
• ప్రాచీన కాలంలో భారతదేశం విజ్ఞానాన్ని సముపార్జించిన దేశంగా పరిఢవిల్లింది.
• ఎన్నో వేల ఏళ్ల క్రితమే అర్బన్ ప్లానింగ్ అంటే ఏమిటో హరప్పా నాగరికత చాటి చెప్పింది.
• 2900 ఏళ్ల క్రితమే యోగాభ్యాసం చేశాం… ప్రధాని మోదీ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవరం రికార్డు స్థాయిలో నిర్వహించాం.
• ఇవాళ యోగాను 150 దేశాలు సాధన చేస్తున్నాయి.
• 2600 ఏళ్ల క్రితమే భారత దేశం ఆయుర్వేదం ద్వారా వైద్య సేవలు అందించింది.
• పూర్వ కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తక్షశిల విశ్వ విద్యాలయం నిర్మించుకున్న దేశం మనది.
• 1600 ఏళ్ల క్రితమే నలంద యూనివర్శిటీ ద్వారా ఆధునిక విద్యను అందించిన ఘనత మనది… సున్నాను భారతీయులే కనుగొన్నారు.
• మెదడుకు పదును పెట్టే చదరంగ క్రీడను కనిపెట్టిన ఘనత కూడా మన భారతీయులదే.
• వివిధ కీలక రంగాల్లో నైపుణ్యం సాధించిన నిపుణులు మన భారతదేశం సొంతం.
• అస్ట్రానమీలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు వంటి గొప్ప వారున్నారు… వీళ్లందరూ మనకు స్పూర్తిని కలిగించేలా చరిత్ర సృష్టించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


