Trinethram News : అందుకే మహిళా శక్తి నిర్మాణం లో RSS విభాగమైన రాష్ట్ర సేవికా సమితి గత 90 సంవత్సరాలు గా దేశం లోని మహిళలను సమీకరించి, ప్రతి సంవత్సరం వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానిలో భాగం గా దివాన్ చెరువు లోని శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల ఆవాసం లో సుమారు గత 15 రోజులుగా యువతులకు, మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. దానిలో భాగం గా రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ వద్దనుండి “రాష్ట్ర సేవికా సమితి” ఆధ్వర్వంలో శుక్రవారం ది.16.05.2025 సాయంత్రం నిర్వహించిన పధసంచలనం (రూట్ మార్చ్) జరిగింది.
స్త్రీ శక్తి కుటుంబానికి , దేశానికి స్ఫూర్తిదాయక శక్తి అని, స్త్రీ శక్తి మేల్కొంటే సమాజం పురోగతి చెందుతుంది అనే ఉద్దేశం తో, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణ ధ్యేయంగా, శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు రాష్ట్ర సేవికా సమితి ప్రాంత సహ కార్యవాహిక శ్రీమతి ఉజ్వల తెలిపారు. మహిళల్లో అంతర్గత శక్తిని వెలికి తీసేందుకు, వారిని ఉత్తేజపరిచేందుకు ఈ రూట్ మార్చ్ దోహదపడుతుందన్నారు. ఈ పధ సంచలనం ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ వద్ద మొదలై స్థానిక వై జంక్షన్ లోని అబ్దుల్ కలాం విగ్రహం మీదుగా జాంపేట గాంధీ బొమ్మ నుండి తిరిగి ప్రకాష్ నగర్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో రాష్టసేవికా సమితి అఖిలభారత ప్రముఖ సంచాలిక మాననీయ శాంతక్క, ఆంధ్ర ప్రాంత కార్యవాహిక శ్రీమతి వేంకటభాను, సమితి కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


