TELANGANA

Chhatrapati Shivaji Jayanti : దీనబంధు కాలనీలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

TRINETHRAM NEWS

కూకట్‌పల్లి ఫిబ్రవరి 19 (త్రినేత్రం న్యూస్) : హిందూ ధర్మ పరిరక్షణకు పోరాడిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ అన్నారు.

చత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని దీనబంధు కాలనీలో ఉన్న శివాజీ విగ్రహానికి సొసైటీ అధ్యక్షులు మాలోత్ మహేందర్ నాయక్, బస్తీవాసులు, శివాజీ అభిమానులతో కలిసి గురువారం ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హిందూ సామ్రాట్ గా శివాజీ రాయ్ గఢ్ కోటలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి చారిత్రాత్మక యోధుడిగా పేరుగాంచారని కొనియాడారు.

భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు శివాజీ అని, సనాతన ధర్మ పరిరక్షణకు అవిశ్రాంతంగా పోరాడారన్నారు. భవాని మాత చేత వీర ఖడ్గం పొందిన వీరుడు శివాజీ ఆశయ సాధనకు పాటుపడుతూ ఐక్యతను చాటాలన్నారు.

నాయకులు దేవ భూషణం, రాజు ముదిరాజ్, గుండ్లకొండ బాలు, రాజా మేష, అజ్జు, సుహాస్ తదితర నాయకులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chhatrapati Shivaji Jayanti celebrations

You cannot copy content of this page