కూకట్ పల్లి ఫిబ్రవరి 19 (త్రినేత్రం న్యూస్) : నవ తెలంగాణ విద్యార్థి శక్తి రాష్ట్ర అధ్యక్షుడు ఈవణి పవన్ కుమార్ వివాహం సూర్యాపేటకు చెందిన సుష్మా సహస్రతో అత్యంత నిరాడంబరంగా, సాదాసీదా రిజిస్ట్రేషన్ విధానంలో జరిగింది. ఆర్భాటాలకు, అనవసర ఆడంబరాలకు దూరంగా జరిగిన ఈ వివాహం యువతకు ఒక సందేశంగా నిలిచింది.
సామాజిక చైతన్యంతో ముందుకు సాగుతున్న ఈ జంట, వివాహ వేడుకను ఖర్చుల ప్రదర్శనగా కాకుండా, బాధ్యతతో కూడిన నిర్ణయంగా మార్చారు. “వివాహాల పేరుతో వృథా ఖర్చులు చేయకుండా, ఆ డబ్బును అవసరంలో ఉన్న పేద విద్యార్థుల విద్యకు వినియోగించాలి” అని పవన్ కుమార్ యువతకు పిలుపునిచ్చారు.
ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, విద్య ద్వారానే సమాజ మార్పు సాధ్యమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మరో కీలక ప్రకటన చేస్తూ, రాబోయే పదవ తరగతి పూర్తి చేసే ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపికైన ఐదుగురు పేద విద్యార్థులకు ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అందించనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం విద్యార్థి సమాజంలో సానుకూల స్పందనను రేకెత్తించింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


