Hindu Dharma : హిందూ దర్మ పోరాటం కోసం తన వంతు కృషి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : హిందు జనశక్తి ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో జ్ఞానపీఠం మహర్షి సాధూ మహారాజ్ రఘేత్తమా మహారాజ్ తో కలిసి పాల్గొన్న బిజెపి పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతీ కిరణ్ బూనేటి ఈ సందర్భంగా, బిజెపి పరిగి అసెంబ్లీ ఇంచార్జ్, మారుతి కిరణ్ బూనేటి , మాట్లాడుతూ హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటే ప్రతి దాడులు అవసరమని అన్నారు. హిందూ దర్మ పోరాటం కోసం తన వంతు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. హిందువులు వ్యాపార అభివృద్ధి, నాయకత్వ ఎదుగుదలపై దృష్టి పెట్టాలని సూచించారు. హిందూ జనశక్తి అద్యక్షులు లలిత్ కూమార్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణ ను అనంత పద్మనాభ స్వామి ఆలయం అధికారికంగా నిర్వహించక పోవడం బాధాకరమన్నారు.

అనంతగిరి కొండలను కాపాడుకోవడం కోసమే ఈ గిరి ప్రదక్షిణను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం మొదలు పెట్టిన గిరి ప్రదక్షిణ రూపకర్తలకు అభినందనలు తెలిపారు. గిరి ప్రదక్షిణం ద్వారా హిందువులలో చైతన్యం తీసుకురావడం ముఖ్య ఉద్దేశమని భక్తితో పాటు ధర్మం పై అవగాహన అవసరమని హిందువులు సంఘటితమై అవసరమైతే ప్రతిదాడులకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. లవ్ జీహాద్ మత మార్పిడి లాంటి ప్రమాదాలను ఎదుర్కోవాలి అంటే కేవలం భక్తి ,భజనలతో పాటు ఎదిరించే తత్వం కూడా హిందువులల్లో పెరగాలి.ధర్మం కోసం పోరాటం , త్యాగం అవసరమన్నారు.
ఈ కార్యక్రమంలో గిరి ప్రదక్షిణ రూపకర్తలు, హిందూ జనశక్తి రాష్ట్ర అద్యక్షులు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానంద్ రెడ్డి , తాపస్ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, టీయూ డబ్ల్యుజే వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింలు హిందూ జనశక్తి జిల్లా అధ్యక్షులు సారా జగన్ శ్రీధర్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు పాండుగౌడ్, బిజెపి నాయకులు జాజుల అనిల్ , అజయ్ గుప్తా , శ్రీహరి , శివ కుమార్ వివిద హిందూ సంఘాల నాయకులు , పలువురు వ్యాపారులు పాల్గోన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Doing his best for the fight for Hindu Dharma

You cannot copy content of this page

Scroll to Top