Awareness : గంజాయి, డ్రగ్స్ బానిసత్వం జీవితాన్ని నాశనం చేస్తుంది

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకులోయ అక్టోబర్ 10, (త్రినేత్రం న్యూస్): అరకు వ్యాలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన మరియు స్టూడెంట్ ఇండక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సీఐ ఎల్. హిమగిరి ప్రధాన అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఐ హిమగిరి విద్యార్థులు ర్యాగింగ్, మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండి, లక్ష్యసాధన కోసం కృషి చేయాలని సూచించారు. సైబర్ నేరాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని, ఓవర్ స్పీడ్ వంటి చట్ట విరుద్ధ చర్యలకు దూరంగా ఉండాలని చెప్పారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. భరత్ కుమార్ నాయక్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ కళాశాలలో ఈగల్ టీం పర్యవేక్షణలో ఉందని, విద్యార్థులు క్రమశిక్షణతో నడుచుకోవాలని సూచించారు.
ఇండక్షన్ కోఆర్డినేటర్ ఎల్ఎంఎస్. గణేష్, అకాడమిక్ కోఆర్డినేటర్ పి. నాగబాబు, ఎన్ఎస్ఎస్ పిఓలు వై. విజయలక్ష్మి, ఎం. అనిత కుమారి, అధ్యాపకులు, పోలీసులు పాల్గొన్నారు. సీఐ హిమగిరిని ప్రిన్సిపల్ దుస్సాలుతో సత్కరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cannabis, drug addiction destroys life

You cannot copy content of this page

Scroll to Top