గత పదేళ్ళలో కేసీఆర్ చేసిన అభివృధి సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయి.
బిఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమాన్ని గుర్తు చేస్తూ ప్రజల ముందుకు.
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్.
దేవరకొండ డివిజన్ డిసెంబర్ 14 త్రినేత్రం న్యూస్. బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్ధుల కు మద్దతుగా ప్రచారంలో మాజి శాసన సభ్యులు రవీంద్ర కుమార్ ఆదివారం దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి టోంగర్ ప్రతాప్ (చింటూ) కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ …..గత పదేళ్ళలో కేసీఆర్ చేసిన అభివృధి సంక్షేమ పథకాలే బీ ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయి అని ఆయన అన్నారు.గ్రామాల్లో బిఆర్ఎస్ సానుభూతిపరులను, కేసీఆర్ గారి అభిమానులను ఏకం చెయ్యాలి అని కోరారు.రెండేళ్ల నుండి కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన తెలిపారు.
బిఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమాన్ని గుర్తు చేస్తూ ప్రజల వద్దకు వెళ్లాలి అని ఆయన తెలిపారు.కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోయామని ప్రజలు స్పష్టమైన అవగాహనతో ఉన్నారు అని ఆయన తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సర్వేలలో బిఆర్ఎస్ పార్టీదే హవా అని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం లేక ఇన్ని రోజులు కాలయాపన చేసింది అని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కడారి సైదులు,తిర్పతయ్య,గుండాల వెంకట్,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


