స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం బీ ఆర్ ఎస్ దే.
దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
దేవరకొండ డివిజన్ డిసెంబర్ 14 త్రినేత్రం న్యూస్. స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొండమల్లెపల్లి మండలం పెండ్లిపాకుల, కొండమల్లెపల్లి, కేశ్య తండా గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపు కోసం రవీంద్ర కుమార్ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు, నేతలు సమన్వయంతో కలిసి పని చేయాలని ఆయన కోరారు.
కేసీఆర్ నేతృత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి గ్రామస్తులకు వివరించి చైతన్యపరచాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం బీ ఆర్ ఎస్ దే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కడారి అంజయ్య, కేసాని లింగా రెడ్డి,రమావత్ దస్రూ నాయక్, పెద్దిశెట్టి సత్యం,ఎట్టెల్లి రాంబాబు, పిల్లి పరమేష్, నెతళ్ళ ఏల్లయ్య,కుమార్,బట్టు కొండల్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


