SP Sneha Mehra : విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిషేధం

TRINETHRAM NEWS

Trinethram News : పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఐపీఎస్ నవాబ్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిటికల్ గ్రామాలైన ఏక్‌మామిడి, అర్కతల, చిట్టిగిద్ద గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పేస్–2 ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు, బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు, డీజేలు, ఇతర వేడుకలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని తెలిపారు.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నంతకాలం ఈ ఆంక్షలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని, నిబంధనలను అతిక్రమించిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు ప్రజలు, నాయకులు మరియు అభ్యర్థులు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Victory rallies, meetings and gatherings are prohibited

You cannot copy content of this page

Scroll to Top