సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Water supplied immediately

12,500 ఎకరాల వరి పంటను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే: బీజేపీ నాయకులు

Water Supplied Immediately : డిండి (గుండ్ల పల్లి) సెప్టెంబర్ 19, త్రినేత్రం న్యూస్. డిండి: డిండి ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో సుమారు 12,500 ఎకరాల్లో సాగవుతున్న వరి పంటకు నీటి కొరత ఏర్పడి రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా డిండి ప్రాజెక్టులోకి తక్షణమే నీటిని అందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు బీజేపీ నాయకులు గుడిపల్లి మోటార్ల వద్ద, చెట్ల చెన్నారం ఎస్కెఫ్ . ప్రాంతంలో. నార్లపూర్ కే ల్ ఐ మెయిన్ పంపు హౌస్ లను పర్యటించి నీటి పరిస్థితిని పరిశీలించారు. రైతులు సాగు చేసిన వరి పంటకు కీలకమైన సమయంలో నీరు అందకపోతే వేలాది ఎకరాల పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. డిండి ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు గతంలో కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా డిండి ప్రాజెక్టులోకి నీటిని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. డిండి ప్రాజెక్టుకు కల్వకుర్తి ఎత్తిపోతల అనుసంధానం, గుడిపల్లి గట్టు రిజర్వాయర్ వ్యవస్థకు సంబంధించిన వివరాలు ప్రభుత్వ పత్రాల్లో కూడా ఉన్నాయి.
రైతులు పంటలు వేసుకున్న తర్వాత నీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి రావడం ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని బీజేపీ నాయకులు విమర్శించారు. రైతుల పంటలను కాపాడాల్సిన సమయంలో నీటి విడుదలపై స్పష్టమైన కార్యాచరణ లేకపోవడం, స్థానికంగా సమస్యను పరిష్కరించేందుకు తగిన చొరవ తీసుకోకపోవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి డిండి ప్రాజెక్టుకు నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను నిర్వర్తించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రైతుల సమస్యను పట్టించుకోకుండా కేవలం హామీలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీశైలం జలాశయంలో నీటి లభ్యత, కల్వకుర్తి ఎత్తిపోతల నిర్వహణ, డిండి ప్రాజెక్టు అవసరాలను సమన్వయం చేసి రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా నీటి విడుదలపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే నీటిని విడుదల చేయాలని, నీటి సరఫరాపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని, డిండి ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు భరోసా కల్పించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు స్థానిక ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. సందర్శించిన వారిలో బిజెపి రాష్ట్ర నాయకులు కేతావత్ లాలూ నాయక్. నక్క వెంకటేష్ యాదవ్.బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు వానం నరేందర్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్ ఏ.టీ.కృష్ణ. ఐటీ సెల్ జిల్లా కన్వీనర్ జల్దా భాస్కర్. మాధవరం నరసింహారావు. చల్లమళ్ళ ప్రవీణ్ కుమార్. వావిళ్ల అంజి యాదవ్.పున్న దినేష్. కందుకూరు సర్పంచ్ బరపటి కొండల్. డిండి వార్డ్ మెంబర్ మాధమూని అమృత్. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page