Trinethram News : హైదరాబాద్ : Jan 22, 2026, బుధవారం అర్ధరాత్రి దాటాక, నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏఆర్బీసీవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నంద్యాల జిల్లా శిరివెళ్లమెట్ట వద్ద ఘోర ప్రమాదానికి గురైంది.
బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతిచెందారు. ఢీకొన్న వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నాయి.
అటుగా వెళ్తున్న డీసీఎం డ్రైవర్ బస్సు అద్దాలను పగులగొట్టడంతో 36 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. స్వల్ప గాయాలైన పదిమందికి పైగా ప్రయాణికులకు నంద్యాల ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


