Trinethram News : హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లా ప్రతీఘాట్ వద్ద బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సు జహు నుంచి మండి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా అక్కడికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


