వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ చనిపోయిన వారి కుటుంబానికి 50 లక్షలు గాయపడిన వారికి 25లక్షలరూపాయలఎక్స్గ్రేషియా ప్రకటించాలి.. చేవెళ్ల మండల పరిధిలోని మిర్జాగూడ గేటు వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి విచారం వ్యక్తం చేస్తూ
ఈ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ ప్రాంత మాజీ మంత్రులు, ఎంపీల నిర్లక్ష్యం కారణంగా అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణ పనులు జరగలేదని అన్నారు 2018లో గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేస్తే అంతకన్నా ముందు ఈ ప్రాంతం నుంచి మంత్రిగా బాధ్యతలు వహించిన సబితా ఇంద్రారెడ్డిగారి మరియు యంపీ యం ఎల్ ఏ తీవ్ర నిర్లక్ష్యం వల్ల రోడ్డు విస్తరణ పనులు జరగలేదని అన్నారు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి జాతీయ రహదారులన్నీ విస్తరణ జరిగాయని హైదరాబాద్కు ఆనుకొని ఉన్న బీజాపూర్ జాతీయ రహదారి మాత్రమే విస్తరణ జరగలేదని అన్నారు ప్రస్తుతం బిజెపి ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి బీజాపూర్ జాతీయ రహదారి పనులకు 2017 లోనే అనుమతి తీసుకువచ్చానని చెప్పారని ఎందుకు రోడ్డు విస్తరణ పనులు ఆగిపోయాయని ప్రశ్నించారు.
ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే అని ఎన్జీటిలో కేస్ వికెట్ చేయించి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం చేసే బాధ్యత ఎంపీ యం యల్ ఎ పైన ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని అన్నారు ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు 50 లక్షలు గాయపడిన వారికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆర్టీసీ టిప్పర్ యాజమాన్యంతో నష్టపరిహారం వచ్చే విధంగా ప్రభుత్వం చూడాలని అన్నారు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు.తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు. నాగభూషణం ఉపాధ్యక్షుడు.యదయ్య మల్లయ్య. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


