వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ డ్యూటీలో ఉండి కార్లు వాషింగ్ చేస్తుండగా కరెంటు షాక్ తో ప్రమాద వశాత్తూ చనిపోయిన హోమ్ గార్డ్ శ్రీనివాస్ కుటుంబానికి ప్రభుత్వం 50లక్షలు పరిహారం ఇచ్చి, ఆ కుటుంబంలో భార్యకు ఉద్యోగం ఇవ్వాలి సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ ప్రభుత్వనికి డిమాండ్ వికారాబాద్ జిల్లా ఎస్పీ ఆఫీస్ లో హోమ్ గార్డ్ గా 18 ఏండ్లుగా కౌకుంట్ల గ్రామనికి చెందిన సి ఎచ్ శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్నారు. రోజు వారిగా డ్యూటీ చేస్తూ పోలీస్ అధికారుల కార్లు వాషింగ్ చేస్తుండగా ప్రమాద వశాత్తూ ఉదయం చనిపోయాడు. పోలీస్ వ్యవస్థలో భాగమైన హోమ్ గార్డ్ వ్యవస్తకు ఎలాంటి కనీస సౌకర్యాలు పిఆర్ సి ఇఎస్ఐ పీఫ్ ప్రమాద బీమా పాలసీ లేదు.
అనేక ఏండ్లుగా హోమ్ గార్డ్ లతో అధికారుల ఇండ్లలో డ్యూటీ లో బయటకూడా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. వీరికి ఎలాంటి ఆత్మగౌరవం లేకుండా కొనసాగుతుంది. ఈ ప్రభుత్వమైన హోమ్ గార్డ్ లకు కనీస వేతనాలు పిఆర్సి, ఇఎస్ ఐ, పీఫ్ ప్రమాద బీమా పాలసీ అమలు చెయ్యాలని ప్రభుత్వనికి డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగులకు ఉపయోగపడే స్కీములు మృతుడి కుటుంబానికి వర్తింప చెయ్యాలి.మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు, LKG ఒక్కరు, 1st క్లాస్ ఒక్కరు చదువుతూ ఉన్నారు. మృతుని శ్రీనివాస్ కుటుంబని ప్రభుత్వం అన్నివిధాలుగా అదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము అన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


