Vikarabad News : ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని అన్యాయం చేయాలనీ చూస్తున్నారు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రంన్యూస్… అవాస్తవాలతో భూమి ఆక్రమించి అన్యాయం చేయాలనే పన్నాగాం పట్టా ప్రకారం మా భూమి మాకు కావాలి బాధితురాలు కళావతి కుమారుడు లక్ష్మారెడ్డి.బంట్వారం మండల పరిధిలోని బొపునారం గ్రామంలో నాలుగు రోజులు క్రిందట మా పొలం విషయంలో తప్పుడు ఆరోపణలతో తహసిల్దార్ కార్యాలయం ముందు ఒక పార్టీ నాయకుడితో ధర్నా చేయించి కొన్ని మీడియా పత్రికలు, ఛానెల్ ద్వారా తప్పుడు ప్రచారం చేయించి ఇబ్బందులకు గురి చేశారని , సర్వే నంబర్ 69/44 చింతకుంట కళావతి భర్త బక్క రెడ్డి పట్టా పాసు పుస్తకం నెంబర్ T0710010759 లో 1.20 భూమిని కలిగి ఉన్నాము, మా పొలం యొక్క దక్షిణ భాగంలో నట్టల రాములు మరియు ఆయన సోదరులు ఐదు ఎకరాల భూమి వారి పెదనాన్న నుండి పొందారు,

వికారాబాద్ జిల్లా ఎస్పీ ఆఫీస్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రాములు అండతో ఆయన సోదరులు పెదనాన్న నుండి వచ్చిన ఐదు ఎకరాల తో పాటు మరో మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా మా యొక్క పొలాన్ని కూడా ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో అధికార అండను చూసుకొని ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని కళావతి కుమారుడు లక్ష్మారెడ్డి మీడియా ప్రతినిధులకు తెలిపారు, గతంలో రెండు మార్లు అప్పటి ధరూర్ సీఐ, మండల రెవిన్యూ అధికారులతో సందర్శించి సమస్యను పరిష్కరించాలని చూసిన సహకరించకుండా కొట్లాటకు దారి తీసారని, మమ్మల్ని మా కుటుంబ సభ్యులను బూతులు తిడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని గతంలో ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు నమోదు చేయించే ప్రయత్నం చేశారని, చట్ట ప్రకారం మాకు ఉన్నటువంటి భూమిని మాకు ఇప్పించాలని మాపై దాడులు చేయడానికి రాములు అయన సోదరుల నుండి విముక్తి కలిగించాలని చట్టప్రకారం తమకు న్యాయం చేయాలని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

injustice by obstructing my job

You cannot copy content of this page

Scroll to Top