Blood Donation Camp : గోదావరిఖని పోలీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

TRINETHRAM NEWS

సమాజాభివృద్ధికి , నేరా నియంత్రణ కి యువత పోలీస్ తో భాగస్వామ్యం కావాలి: పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.,

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి , రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ గోదావరిఖని ఎం. రమేష్ కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ రక్తం అనేది జీవితాలను కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అక్టోబర్ 21 పోలీసు వారోత్సవాల సందర్భంగా ప్రజల గురించి పోలీసు ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తు కలిసి పనిచేస్తున్నారు అనేది ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది.

ప్రాణాలు అరిప్పించిన వారి త్యాగాలను గుర్తు చేస్తూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలీసు తమ విధి నిర్వహణలో ప్రజల రక్షణతో పాటు ఎలాంటి అత్యవసర సమయంలోనైనా, పండగల సమయంలోనైనా ఎల్లవేళలా 24 గంటలు ప్రజల ధన మాన ప్రాణ రక్షణకై పోలీసులు విధులను నిర్వర్తిస్తారని దానితో పాటు ప్రజలకు అత్యవసర సమయంలో, ప్రమాద ఆపద సమయంలో ప్రాణాల రక్షణ కొరకు, తల సేమియా వ్యాధిగ్రస్తులకు అవసరమైన రక్తం కోసం ఇలాంటి కార్యక్రమంలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అన్నారు. భవిష్యత్తులో ఇక్కడున్న చాలామంది యువత పోలీస్ శాఖ లో పనిచేయడానికి ఇష్టం తో ఆసక్తి తో ప్రయత్నించే వారున్నారు. మీలాంటి యువతను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.

యువత పోలీస్ తో కలిసి శాంతిభద్రత పరిరక్షణలో భాగస్వామ్యం అయ్యేలాగా అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని, అదేవిదంగా యువత ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సు, రక్షణ, నేరాల నియంత్రణ లో పోలీస్ కి సహకరిస్తూ సమాజాభివృద్ధికి బాధ్యతగా వ్యవహరించాలని పోలీస్ కమిషనర్ గారు అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల లో భాగంగా కమీషనరేట్ పరిధిలో రక్తదాన శిబిరాలని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల ను స్ఫూర్తిగా తీసుకొని యువత బాధ్యత గా వ్యవహారిస్తూ ముందుకు వచ్చి పోలీస్ కి సహకరించాలని సూచించారు ఈ రక్తదాన శిబిరం లో పెద్దపల్లి డిసిపి కరుణాకర్, గోదావరిఖని ఏసిపి రమేష్, సిఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్, ఎస్ఐ రమేష్, రామగుండం ఎస్ ఐ సంధ్యారాణి, పోలీస్ స్టేషన్ సిబ్బంది తో పాటు నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తల సేమియా వ్యాధిగ్రస్తులకు అందించనున్నారు ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ ఎస్సైలు రమేష్, అనూష, రామగుండం ఎస్సై సంధ్యారాణి అంతర్గం ఎస్ఐ వెంకట్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎల్లప్ప, జోన్ చైర్మన్ మల్లికార్జున్, రిజియాన్ చైర్మన్ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Blood donation camp u

You cannot copy content of this page

Scroll to Top