Security in Banks : బ్యాంకుల్లో భద్రతపై గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తనిఖీ

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు భద్రతా చర్యల్లో భాగంగా గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ పక్కన ఎస్బిఐ బ్యాంక్, న్యూస్ అశోక్ థియేటర్ పక్కన యూనియన్ బ్యాంక్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న హెచ్డీఫ్సీ బ్యాంక్ లలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తనిఖీలు నిర్వహించారు అదేవిదంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని మిగతా బ్యాంకుల్లో భద్రతపై ఎస్ ఐ రమేష్ కూడా తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో, ఏటీఎంల వద్ద తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సీసీ టీవీ కెమెరాలు బ్యాంకులు భద్రత ప్రయోజనాల కోసం కలిగి ఉండాలని సూచించారు.

తదనుగుణంగా బ్యాంకు భద్రతాంశాలపై బ్యాంకు ఆవరణ అంతా కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూమ్, సెక్యూరిటీ గార్డ్, సీసీ కెమెరాలు, లైటింగ్, సెక్యూరిటీ గార్డ్ ఏర్పాటు, బ్యాంకుల్లో భద్రతా లోపాలు ఉండకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. బ్యాంక్ కు వచ్చే కస్టమర్ లకు ఎవరైనా ఎక్కువ సమయం బ్యాంక్ లో ఉన్నట్టు అనుమానస్పదంగా అనిపిస్తే సమాచారం చెప్పాలని, బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసుకొని వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా కస్టమర్లకు అవగాహన కల్పించాలని బ్యాంక్ అధికారులకు సిఐ సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CI Indrasena Reddy inspects security in banks

You cannot copy content of this page

Scroll to Top