Tummala Raja Reddy : వైద్య సేవలు నిర్లక్ష్యం చేస్తున్న బాధ్యులపై చర్యలు తీసుకోవాలి సిఐటియు

TRINETHRAM NEWS

తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణిలో కార్మికుల కుటుంబాలకు సంక్షేమం వైద్య సేవలు అందించాల్సిన యాజమాన్యం అందించడం లేదని సిఐటియుగా గత రెండు మూడు సంవత్సరాలుగా ఆందోళన చేస్తూ అనేక సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకు వస్తున్న పట్టించుకోవడంలేదని చివరకు ఎల్ వన్ మందులను వాడడం వలన కార్మికులకు ఉన్న రోగాలు తగ్గక మానసికంగా ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు సింగరేణిలో యువ కార్మికులు వస్తున్నారని గొప్పలు చెప్పుకుంటున్న యాజమాన్యం వారి కుటుంబాలకు కావలసిన వైద్య సేవలు దృష్ట్యా గైనకాలజిస్ట్లు పిల్లల డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని చివరకు గర్భిణీ స్త్రీలకు చేయవలసిన స్కానింగ్ కూడా చేయకపోవడం వలన ప్రాణాల మీదికి వస్తున్నాయని తాజాగా గోదావరిఖని ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ తప్పిదం వలన గర్భంలోనే శిశువు మృతి చెందడం దీనికి ఉదాహరణ అని గతంలోనూ ఆ వైద్యురాలి పై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకపోవడం వలన నేడు గర్భంలోనే శిశువు మృతి చెందింది అన్నారు చిన్న తప్పులకే కార్మికులపై సస్పెండ్ డిస్మిస్ చేస్తున్న యాజమాన్యం ఇలాంటి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని రిఫరల్ తగ్గింపు పేరుతో సరైన వైద్య పరికరాలు లేకుండా స్పెషలిస్ట్ డాక్టర్లు లేకుండా ఆస్పత్రులలో రోజుల తరబడి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారిని ఉంచుకుంటూ మరింత రోగాల బారిన పడేలా చేస్తున్న యాజమాన్యం తీరు సరైనది కాదని అదే విధంగా యాజమాన్యం రిఫరల్ పంపిస్తున్న ఆసుపత్రులు కార్మికుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ఆసుపత్రులను రిఫరల్ నుండి తీసివేసి కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే ఆసుపత్రులకు పంపించాలని డిమాండ్ చేశారు.

అన్ని ఏరియా ఆసుపత్రులలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కొరకు స్కానింగ్ మిషన్లు మరియు నియోనటాలజిస్టులను ఏర్పాటు చేయాలని, మరియు ఖ్యాతిలాపులను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, తోట నరహరిరావు, ఆసరి మహేష్, జంగాపల్లి మల్లేష్, ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు,

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CITU should take action

You cannot copy content of this page

Scroll to Top