జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య జన్మదిన వేడుకలు చేవెళ్లలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య తన కుటుం సభ్యులతో చేవెళ్లలోని లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అంతకు ముందు చేవెళ్ళ లోని మహనీయుల విగ్రహాలకు ఎమ్మెల్యే కాలే యాదయ్య పూలమాలలు వేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా కేజీఆర్ గార్డెన్లో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
రక్తదానం చేసిన వారు 211, అనంతరం అభిమానులు గజమాలను వేసి సంబరాలు చేశారు. నాయకులు టపాసులు పేల్చి కేజీఆర్‌ గార్డెన్‌ లోని ప్రజాప్రతినిధులు తెచ్చిన కేక్‌ను ఎమ్మెల్యే కట్‌ చేశారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, మాజీ రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ అనీత హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారుఈ కార్యక్రమంలోని అధికారులు ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,
కాంగ్రెస్ పార్టీ నాయకులు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Birthday celebrations in grand

You cannot copy content of this page