వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి వరి కొనుగోలు, సన్న బియ్యం పంపిణీపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల కమిషనర్ డి.ఎస్. చౌహన్ లతో కలిసి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వరి ధాన్యం కొనుగోలు, కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికారాబాద్ జిల్లాలో వరి ధాన్య సేకరణపై మంత్రి ఆరా తీయగా. జిల్లాలో 128 వరి కొనుగోలు కేంద్రాల్లో వరి కొనుగోలు ప్రక్రియను మొదలు పెట్టామని, ఇప్పటికీ 25 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వివరించారు. కేంద్రాల్లో మౌలిక సదుపాయాలతో పాటు కావలసిన తాడిపత్రిలు, సంచులు, తేమ యంత్రాలను ఏర్పాటు చేశామని మంత్రికి తెలిపారు.
వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిన రైతులకు నిర్దిష్టమైన సమయంలో వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, డిఆర్డిఓ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


