చింత పల్లి ఫిబ్రవరి 22, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలంలోని నెల్వలపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి మల్లన్న స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో దేవరకొండ శాసన సభ్యులు. నేనావత్ బాలు నాయక్ పాల్గొని, స్వామి వారిని దర్శించుకొని,స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో దేవరకొండ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


