Bheem Bharat : తంగడ పల్లీ గ్రామంలో విద్యార్థులకు పుస్తకాలు , బ్యాగ్ లు పంపిణీ చేసిన భీమ్ భరత్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : చేవెళ్ళ మండలం తంగడ పల్లీ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లో ఆయా గ్రామ సీనియర్ నాయకులు దాతలు శ్రీకాంత్ రెడ్డి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలు , బ్యాగ్ లు నోట్ బుక్ లు , పంపిణీ చేసిన చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న . అని అన్నారు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య నీ అందిస్తు మధ్యాహ్నం భోజనం , మరియు రాగి జావా లాంటి ఎన్నో విధాలుగా ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థులకు అందిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరు హర్షణీయం అని అన్నారు అదే విధంగా విద్యార్థులు బాగా చదువుకొని మీ లక్ష్యాలను చేరాలని కోరారు.. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మండల విద్యాధికారి కి , హెడ్ మాస్టర్ , MPPS ప్రధానోపాధ్యాయులు , మరియు ఉపాధ్యాయులు , దాతలు అయిన శ్రీకాంత్ రెడ్డి ని అభినందిస్తూ కృతఙ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు గా పాల్గొన్న చేవెళ్ళ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పెంట రెడ్డి , మండల విద్యాధికారి పురం దాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య , ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్ , స్కూల్ బ్యాగ్ నోట్ బుక్స్ దాత ఎలిగేటి శ్రీకాంత్ రెడ్డి , తలారం హెచ్ఎం రాజశేఖర్ , జాకిర్ , గయాస్, శ్రీనివాస్ రెడ్డి, మా అమ్మది అమ్జాద్,, ఫయాజ్, రాజేందర్ రెడ్డి, , పాఠశాల ఉపాధ్యాయులు, అనసూయ , రామచంద్రయ్య, మోహన్ గ్రామస్తుల, గ్రామ కార్యదర్శి శేఖర్, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bheem Bharat distributed books

You cannot copy content of this page

Scroll to Top