Black Jaggery : డిండి పోలీసులు పట్టుకున్ననల్లబెల్లం పట్టిక

TRINETHRAM NEWS

డిండి కేంద్రంగా జోరుగా సారా బెల్లం వ్యాపారం.
చూసి చూడనట్లుగా అధికారుల తీరు.
మామూళ్ల మత్తులో ఆబ్కారీ శాఖ.
నాటుసారాకు బానిసలై ప్రాణాలను కోల్పుతున్నయువకులు.
నామ మాత్రంగా తనిఖీలు చేస్తున్న అధికారులు.
డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. నల్గొండ సరిహద్దులో ఉన్న డిండి మండల కేంద్రంగా నిషేధిత నల్ల బెల్లం పట్టిక వ్యాపారం అడ్డు అదుపు లేకుండా సాగుతుంది. నాటు సారా తయారికిముదిశారుకుగా ఉపయోగించే పదార్థాలను రాత్రి వేళల్లో తండాలకు,గ్రామాలకు తరలించి దళారులు సొమ్ము చేసుకుంటున్నారు .నల్లబెల్లం నాటుసారా తయారీకి అడ్డుకట్ట వేయాల్సిన ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లుగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
హైద్రబాద్ నుంచి అర్ధరాత్రి కార్లు,ఆటోలు, మరియు ఇతర వాహనాల్లో నల్లబెల్లం పట్టికను తరలించి వ్యవసాయ బావులు, పొలావద్దకు చేర్చి తండాల్లో ఏర్పాటు చేసుకున్న ఎజెంట్ల కు ఫోన్ ల ద్వారా సమాచారం చేరవేసి అక్కడినుండి గుట్టుగా నిల్వ చేసుకుని నాటుసారా తయారీకి విక్రయిస్తున్నారు. హైద్రాబాద్ నుంచి వచ్చే మార్గంలో మామూలు అందిస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికి తోడు నల్లబెల్లం అనుమానం రాకుండా ఉండేవిధంగా ఖరీదైన కార్లలో తరలిస్తున్నారని వినికిడి. ఉన్నతాధికారులు అదేశించినప్పుడు మాత్రమే ఏదో హడావిడి చేస్తూ ఒకటో రెండో కేసులు నమోదుచేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
నాటు సారాకి బానిసలు గా మారి యువకులు తమ బంగారులాంటి భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నారని, కాయా కష్టం చేసి తెచ్చుకున్న కూలి డబ్బులునాటు సారాకి ఖర్చు చేసి ప్రాణలమీదికి తెచ్చుకుంటున్నారని , సారతయారిలో బెల్లం ,పట్టిక తో పాటు యూరియా, మత్తుకలిగించేందుకు హానికారక రసాయన పదార్థాలు కలుపుతున్నట్లు తెలుస్తుంది.
ఇటీవల డిండి మండల కేంద్రానికి చెందిన యాదయ్య,మల్లెపాపి ఇద మయ్య ,చింత మొగుళాలు నాటు సారకు అలవాటై మృత్యు వాతపడ్డారు.వీరంతా 30 సం;; లోపు వారే మరికొంత మంది నాటుసారా కి బానిసలై ఆరోగ్యం క్షీణించి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నాటు సారకి ఉపయోగించే నల్లబెల్లం పట్టిక రవాణాను అరికట్టాలని పేదల జీవితాలను హరిస్తున్న నాటు సారా మహమ్మారిని పల్లెల్లో గ్రామాల్లో తయారు చేయకుండా చూడాలని డిండి మండల ప్రజలు ఎక్సైజ్ అధికారులను కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dindi police seize black

You cannot copy content of this page

Scroll to Top