డిండి మండలములో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో విద్యార్థులు ప్రభంజనం 93.73% ఉత్తీర్ణత. 549, 541 మార్కులతో ఆదర్శ పాఠశాల విద్యార్థులు 521 మార్కులతో 97.22% జెడ్పిహెచ్ స్కూల్ చెరకుపల్లి విద్యార్థులు*
డిండి (గుండ్లపల్లి) మే 1 త్రినేత్రం న్యూస్. 2024-25 సంవత్సర పదవ తరగతి పరీక్షా ఫలితాలలో డిండి మండల ఆదర్శ పాఠశాల, చెరకుపల్లి జెడ్పిహెచ్ఎస్ స్కూల్, విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో సత్తా చాటారు.93.73 % రిజల్ట్స్ తోఆదర్శ పాఠశాల విద్యార్థులు, 97.22%తో చెరకుపల్లి జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ సందర్భంగా డిండి మండల విద్యాధికారి ఇస్లావత్ గొప్య నాయక్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తాము పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని అన్నారు. ప్రైవేట్ స్కూల్స్ లో కూడా సాధించని విధంగా తమ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించటం పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
ఆదర్శ పాఠశాల నుండి ప్రధమ ర్యాంక్ సాధించిన ఆర్. గనకీర్తి, ఎం.డి.రహమాత్ ఫాతీమా చెరకుపల్లి జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నుంచి ప్రధమ ర్యాంకు సాధించిన నవ్య శ్రీ కాట్రవథ్ రామ్ చరణ్ మార్కులతో మండలమునకు మంచి పేరు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులను అభినందించారు .ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


