Cyber Frauds : సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

TRINETHRAM NEWS

ఆలమూరు ఎస్సై జి నరేష్..

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 11. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు, రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్సై జి నరేష్ సూచించారు.శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు.మండలంలోని ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగహన పెంచుకుని, మరికొందరికి అవగాహన, కల్పించాలన్నారు. చదువుకున్న వాళ్లు కూడా ఇటీవల సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. కొరియర్ పేరుతోనూ మోసాలు, జరుగుతున్నాయని, చైల్డోఫోర్నోగ్రఫీ, డిజిటల్ అరెస్టులు, ఓటీపీ మోసాలు, లోన్ యాప్, హనీట్రాప్, లాటరీల పేరుతోను, డిబెట్ కార్డు మోసాలు, వీడియోకాల్స్ చేసి స్క్రీన్ రికార్డు చేసి బ్లాక్ మెయిలింగ్, తదితర నేరాలకు పాల్పడుతున్నారన్నారు.

ఇటీవల సోషల్ మీడియాలోని, వాట్సాప్ వేదికగా ఎస్బిఐ,రైతు భరోసా వంటి సేవా, కేంద్రాలకు ఏపీకే యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ను లింక్, చేసుకోవాలంటున్నారని, ఇలా యాప్ లు ఇన్స్టాల్ చేయడం, వల్ల మీయొక్క ఫోన్ హ్యాక్ చేసి పర్సనల్ డేటాను దొంగలిస్తూ కొత్త తరహా మోసాలకు, పాల్పడుతున్నారన్నారు. స్మార్ట్ ఫోన్లు మంచి కోసం ఉపయోగించుకుంటే జీవితం సాఫీగా ఉంటుందన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ఫొటోలను చూసి ఆకర్షణకులోనై మోసపోకూడదన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి ఎక్కువగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. బ్యాంకు ఖాతాలకు స్ట్రాంగ్ పాస్వర్డ్లను సెట్ చేసుకుని సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 నెంబరు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో www.cybercrime.gov.in ఫిర్యాదులు చేయాలని ఎస్సై సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Be vigilant against cyber frauds

You cannot copy content of this page

Scroll to Top