BC Association Leaders Call : ఈనెల 18న రాష్ట్ర బంద్ పిలుపునిచ్చిన బీసీ సంఘం నేతలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్:42 శాతం బీసీ రిజర్వేషన్లు హైకోర్టు స్టే ఇచ్చినందుకు నిరసనగా ఈనెల 18న రాష్ట్ర బంద్. బిఆర్ కృష్ణ ముదిరాజ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి. స్థానిక సంస్థలలో బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చినందుకు, ప్రశాంతంగా నిరసనగా ఈనెల 18 శనివారం రాష్ట్ర బంద్ జరపాలని బీసీ సంఘాలు కుల సంఘాలు పూర్తి మద్దతు ఇచ్చి బిసి రిజర్వేషన్ ను ఆపడం బీసీల నూట కాడి ముద్ద లాక్కోవడం మైనని అని బి ఆర్ కృష్ణ ముదిరాజ్ ఆవేదన వ్యక్తపరిచాడు.
ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టే ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం. భారతదేశ చరిత్రలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టే ఇవ్వడం జరగలేదు. మొదటిసారి న్యాయ చరిత్రలో ఇలా బీసీలపై అన్యాయంగా స్టే ఇచ్చారు.. నోటిఫికేషన్ వేలాదిమంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కోర్టు ఎలా స్టై ఇస్తారు. కేసు నాలుగు రోజులుగా కోర్టులో నడుస్తుంది ఇస్తే మొదటి రోజే ఇవ్వాలి కానీ రెండుసార్లు స్టే ఇవ్వబోమని కోర్టు ఇవ్వడానికి నిరాకరించింది. నోటిఫికేషన్ ఇచిన తరువాత స్టే ఇచ్చారు ఇది అత్యంత బాధాకరమైన విషయం,రిజర్వేషన్ల కేసులో 30 బీసీ సంఘాలు ఇంప్లీడ్ కేసులు వేశారు పిటిషనర్ల వాదన కూడా వినకుండా స్టే ఎలా ఇస్తారని ఇది బీసీల దురదృష్టమని ప్రభుత్వాల నిర్లక్ష్ణమని ఆయన అభిప్రాయపడ్డాడు బీసీలను అవమానపరిచారని దీనికి భారీ మూల్యం చెల్లిస్తారని పిలుపునిచ్చారు అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు మద్దతుగా కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ఉన్నత న్యాయస్థానాలు బీసీలకు వ్యతిరేకంగా తీర్పులు వరుసగా ఇస్తున్నందు న దీనికి ప్రధానంగా జడ్జీలలో బీసీ ఎస్సీ ఎస్టీలు లేకపోవడమే ప్రధాన కారణం హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలా నియామకాల్లో ఈ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సందర్భంగా 50% సీలింగ్ ను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. సమయం – సందర్భాన్ని బట్టి 50 శాతం సడలించాలని ఆదేశాలు యున్నవి. అగ్రకులాలకు రిజర్వేషన్లపై ఈ కేసు సందర్భంగా 50% సీలింగ్ ఎత్తివేసారు. బీసీ కేసు సందర్భంగా ఎత్తివేయడానికి అభ్యంతరం ఏమిటి రాజకీయ రిజర్వేషన్లకు 50 శాతం సీలింగ్ కు అర్ధం హేతుబద్ధత లేదు. ఎందుకంటే విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లకు మెరిట్” దెబ్బ తింటుందని చేసే వాదనకు కొంతవరకు హేతు బద్దత న్యాయం యుంది. మండల్ కమిషన్ కేసులో కూడా రాజకీయ, విద్య, ఉద్యోగాలకు మెరిట్” యుంటుందని 50 శాతం సీలింగ్ ప్రస్తావన యుంది. చదువు రాని వారు కూడా ఎన్నికలలో పోటీ చేస్తారు. అలాంటప్పుడు ఈ రాజకీయ రిజర్వేషన్లకు 50 శాతం నిబంధనకు ఎలాంటి హేతుబద్ధమైన కారణం లేదు. ఇది పూర్తి అసంబద్ధమైనది.
బీసీ రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పరంగా ఒప్పుకోము . రిజర్వేషన్లు 20 శాతం కు తగ్గించి ఎన్నికలకు పోతే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని హెచ్చరించారు. పార్టీ పరం ఇస్తే బీసీలకు అన్యాయం జరుగుతది బీసీలకు ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే , .ఇతర పార్టీలు డబ్బులు ఉన్నవారికి ఇస్తారు. వారితో పోటీ పడలేరు. అందుకే చట్టపరంగా రాజ్యాంగబద్ధగా ఇవ్వాలని కోరారు. కాబట్టి బీసీ బంధువులు అందరూ పార్టీలకతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరు చున్నాను

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BC Association leaders call for state bandh

You cannot copy content of this page

Scroll to Top