Bandi Ramesh : ఘనంగా నిర్వహించిన వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 4 : పేద ప్రజల కోసం మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి రంగా చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు.రంగా 78వ జయంతిని పురస్కరించుకుని కేపీహెచ్బీ కాలనీ బస్టాండ్ లో ఉన్న రంగా విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఆయన అభిమానులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బండి రమేష్ మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కాపు సామాజిక నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు అన్న సంతర్పణ నిర్వహించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Grand celebration of Vangaveeti

You cannot copy content of this page

Scroll to Top