జూన్ 27, 2026
TRINETHRAM NEWS
Axe Party'

Axe Party : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : జూన్ 27; – అమరావతి రైతుల ఆగ్రహానికి కారణం వైసీపీ ద్వంద్వ వైఖరే అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
అమరావతి విషయంలో రాష్ట్ర ప్రజలను, రైతులను మోసం చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు మళ్లీ రైతుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. అమరావతి రాజధానిని ఐదేళ్ల పాటు నిర్వీర్యం చేసి, వేలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడిన వాళ్లే ఇప్పుడు ‘అమరావతి రైతు పరిరక్షణ’ పేరుతో కొత్త నాటకాలు ఆడటం సిగ్గుచేటు అని తెలిపారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అందుకే వైసీపీ నాయకులు ఎక్కడికి వెళ్లినా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు అని పేర్కొన్నారు. రాజకీయాల కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, ప్రజల సహనాన్ని పరీక్షిస్తే ప్రజల నుంచి తీవ్ర ప్రతిస్పందనే వస్తుంది.

ప్రజలను రెచ్చగొట్టి ఆ తర్వాత బాధితులమని నటించడం వైసీపీకి అలవాటైపోయింది. ఆ రాజకీయాలకు కాలం చెల్లింది అని సూచించారు. ఆ రైతుల నిరసనలను అణచివేసేందుకు వైసీపీ పాలనలో ఎలాంటి దౌర్జన్యాలు జరిగాయో రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తున్నాయని, ఇప్పుడు అదే రైతుల పేరుతో రాజకీయ పర్యటనలు చేయడం పూర్తిగా అవకాశవాద రాజకీయమని మండిపడ్డారు.గొడ్డలి పార్టీ నాయకుల పర్యటన సందర్భంగా శాంతిభద్రతలను కాపాడేందుకు విధుల్లో ఉన్న పోలీసులపైనే దాడి చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని ,

ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడటం అత్యంత విచారకరమని, ప్రజాస్వామ్యంలో పోలీసులపై దాడులకు ఎలాంటి సమర్థన ఉండదని స్పష్టం చేశారు. ప్రజలను రెచ్చగొట్టడం, ఉద్రిక్తతలు సృష్టించడం తర్వాత నాటకాలు ఆడటం గొడ్డలి పార్టీ రాజకీయాలుగా మారాయి. అలాంటి చౌకబారు రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక ఏమాత్రం నమ్మరు. అమరావతి రైతుల మనోభావాలను గౌరవించాల్సిందే తప్ప, వారిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం మానుకోవాలి అని హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page