జూన్ 27, 2026
TRINETHRAM NEWS
Juttu Satish Additional security

స్వైరో నేత :- జుట్టు సతీష్.

Juttu Satish : దేవరకొండ డివిజన్ జూన్ 27, త్రినేత్రం న్యూస్ : బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను తెలంగాణ ప్రభుత్వం తొలగించడంపై తీవ్రంగా ఖండిస్తున్నామని స్వెరో నేత జుట్టు సతీష్ అన్నారు.ఆయన ఈసందర్భంగా మాట్లాడారు కచ్చితంగా సెక్యూరిటీ పునరుద్ధరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

_భద్రత ఉపసంహరణ వివాదం: — ప్రభుత్వం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ఇంటెలిజెన్స్ నివేదికలు లేకుండానే ప్రవీణ్ కుమార్ సెక్యూరిటీని మరియు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించింది. దీనిపై ఆయన స్పందిస్తూ తనకు ఎలాంటి హాని జరిగినా సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత అని తేల్చిచెప్పారు .

నేతల డిమాండ్: మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తదితరులు ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించారు. ప్రవీణ్ కుమార్ ప్రజల పక్షాన, బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడే నాయకుడని, ఆయనకు హత్య ప్రమాదం ఉన్నందున వెంటనే అదనపు సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు.

–భవిష్యత్తు కార్యాచరణ: – ఈ నిర్ణయం కక్షసాధింపు చర్యల్లో స్వేరోస్ మండిపడుతున్నాయి. డా. ప్రవీణ్ కుమార్‌కు తక్షణమే రక్షణ కల్పించకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతామని స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page