రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి రహేన నేడు రైతులతో సమావేశం ఏర్పాటు-
డిండి (గుండ్ల పల్లి )మే 27,త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రం నందు రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి రహేన నేడు రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.రైతులకు పంటలు పండించుట కొరకు తగిన సూచనలు చేశారు .
భూమి ఆరోగ్యం మెరుగవుతుంది – వరుసగా ఒకే పంట వేయకుండా, వివిధ రకాల పంటలు మార్పిడి చేసి వేస్తేమట్టి పోషకాలు బలపడతాయి. ఆర్థిక లాభం – మార్కెట్ లో ఒక పంట ధర పడిపోయినా, మిగిలిన పంటల వల్ల ఆ నష్టాన్ని తగ్గించుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణ – మట్టి నిర్జీవం కావడం, నీటి వనరుల దుర్వినియోగం తగ్గుతుంది.
రోగాలు మరియు తెగుళ్ల నివారణ ఒకే పంట వేస్తూ ఉండడం వల్ల వచ్చే తెగుళ్లకి నిరోధం ఏర్పడుతుంది. ఆహార భద్రత – మన కుటుంబానికి కావలసిన అన్ని రకాల ధాన్యాలు, కూరగాయలు, కాయగూరలు మనమే సాగు చేయవచ్చుపంట మార్పు అవగాహన కార్యక్రమంలో రైతులు వ్యవసాయ అధికారులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


