త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండలo లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగు వాడి పౌరుషాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పిన తెలుగు తల్లి ముద్దుబిడ్డ, ఆంధ్రుల అభిమాన ముఖ్యమంత్రిగా పేరు పొందిన నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా పెనుమూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దినేని రుద్రయ్య నాయుడు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మరియు ఎన్టీఆర్ సర్కిల్లో గల స్వర్గీయ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ తలారి రెడ్డప్ప, మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్, ఉపాధ్యక్షులు ప్రసాద్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు అశోక్, సీనియర్ నాయకులు గోపాల్ నాయుడు, శ్రీనివాస్ చౌదరి, రాజగోపాల్ నాయుడు, గుర్రప్ప రాయుడు, కిషోర్ నాయుడు, నరేంద్ర ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


